21 April, 2026 | 4:58 AM

వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

21-04-2026 03:28 AM

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ అర్బన్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన శాఖను ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశగా డీసీసీ బ్యాంక్ రైతులకు ఆర్థికంగా తోడ్పడుతూ తమ వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నందుకు ఎంపీ అభినందనలు తెలిపారు. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు రైతులకు 727 కోట్ల రుణాలు, అలాగే ఇతర విభాగాల ద్వారా 2.8 కోట్ల పంట రుణాలు అందించడం జరిగిందన్నారు.

వ్యవసాయ భూముల తనఖా ఆధారంగా విద్యార్థులకు 50 లక్షల వరకు విద్యా రుణాలు అందించడం అభినందనీయమన్నారు. అలాగే బంగారు ఆభరణాలపై 541 కోట్ల రుణాలు మంజూరు చేయడం బ్యా్ంప ప్రజల నమ్మకాన్ని చూపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, డిసిసి బ్యాంకు సీఈవో వజీర్ సుల్తాన్, పిఎసిఎస్ హసన్ పర్తి పీఐసీ జగన్ మోహన్ రావు, కిసాన్ సెల్ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, నాబార్డ్ డీడీఎం చైతన్య రవి పాల్గొన్నారు.