26 May, 2026 | 5:49 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు

23-02-2026 12:00 AM

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్

ముషీరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మ గౌరవం, సంక్షేమం, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ తెలంగాణ పునర్ నిర్మాణ మే తమ లక్ష్యం అని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల అంశాన్ని ఎజెండాగా మార్చింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరమేనని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తెలంగాణ ఉద్యమ కారుల అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిన తర్వాత నేడు కొంత మంది వివిధ సంఘాల పేర్లతో మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న ప్పుడే 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నినదించిన ఏకైక మొట్ట మొదటి సంఘం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వివేక్ వెంకట స్వామి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు.