26 May, 2026 | 6:16 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు

26-05-2026 05:16 PM

హైదరాబాద్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలిందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(Telangana DGP CV Anand) పేర్కొన్నారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి(Pasunuri Narahari Surrenders) లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. భార్య దానిమ్మతో కలిసి నరహరి లొంగిపోయారని ఆయన మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. నరహరి హనుమకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందినవారు. డిగ్రీ చదువుతున్న సమయంలో నరహరి ఉద్యమంలోకి వెళ్లిపోయారని డీజీపీ వివరించారు.

2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నరహరి పదోన్నతి పొందారని వెల్లడించారు. తొపాకులు, మోర్టార్లు, రాకెట్లు, గ్రనేడ్ల తయారీలో నరహరి నిపుణులని డీజీజీ సూచించారు. నక్సలిజాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని డీజీనీ సూచించారు. గణపతి, జాడే సుజాత, వార్త శేఖర్ మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలంగాణ డీజీపీ పేర్కొన్నారు.