సొంతింటి కల సాకారమే లక్ష్యం
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
తుర్కయంజాల్, జులై 15 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం లింగంపల్లి గేటు వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సర్టిఫికెట్లను మంచాల మండలంలోని నోముల, లింగంపల్లి, మంచాల గ్రామాలకు చెందిన 96 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేయడం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్ర మంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






