calender_icon.png 6 February, 2026 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం

06-02-2026 01:09:12 AM

అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా

మెదక్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల, చిల్డ్రన్స్ హై స్కూల్, గ్రామర్ హై స్కూల్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, లింగారెడ్డిపేట్ లో ఏర్పాటు చేసిన డిస్టెబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్లు, మౌలిక వసతులు, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ పరిశీలన చేపట్టినట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

పోలింగ్ రోజున ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టనున్న భద్రతా ఏర్పాట్లపై తూప్రాన్ సీఐ శ్రీ రంగా కృష్ణ, ఎస్‌ఐ శ్రీ గంగారాజు న వివరాలు అడిగి తెలుసుకన్నారు. డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ,

అక్రమంగా మద్యం విక్రయం లేదా పంపిణీ చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూప్రాన్లో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్టి చెక్పోస్ట్ను కూడా పరిశీలించి, ప్రతి వాహనాన్ని అప్రమత్తతతో తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంట తూప్రాన్ సీఐ శ్రీ రంగా కృష్ణ, ఎస్‌ఐ శ్రీ గంగారాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.