06-02-2026 01:07:52 AM
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని 5,7,8,9,10 వార్డుల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు మామిళ్ళ ఆంజనేయులు, మాయ అనురాధ శ్రీనివాస్, మాయ గంగామణి మల్లేశం, జుబేర్ అహ్మద్, వ నం లత వెంకటేష్ లకు మద్దతుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భం గా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేళ్లు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అందువల్ల కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు. ఆరు గ్యారెంటీల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిలో ఉన్నారని చెప్పారు. నేను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. కానీ రెండేళ్లలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాలేద ని పేర్కొన్నారు.
మెదక్ మున్సిపల్ లో బిఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజాగౌడ్, మాజీ ఎంపీపీ కిష్టయ్య, వార్డ్ ఇన్చార్జిలు గట్టయ్య, షాకీర్, ప్రభాకర్, ఎంబిపూర్ మహేష్, రంగారావు, రాజ్ కుమార్, స్వామి, లాలు నాయక్, అంటోని, వినయ్, నాయకులు లింగా రెడ్డి, జైపాల్ రెడ్డి, సోములు, ఫాజిల్, కండెల నర్సింలు, గోపాల కృష్ణ, హరి, ఓమర్ ఫారుక్, స్వామి నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.