06-02-2026 01:10:30 AM
ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం
చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ డిమాండ్
జహీరాబాద్, ఫిబ్రవరి 5 :ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కొంతమంది దళారులు, అనధికార పూజారులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ భక్తులను వేధిస్తున్నారని ఝరాసంగం మాజీ ఎంపీటీసీ రజిని ప్రియ సంతోష్ పటేల్ తీ వ్రంగా ఆరోపించారు. పూజల పేరుతో భక్తు ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, రసీదు లు ఇవ్వకుండా ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అనధికార పూజారులు అభిషేకాలు, అర్చనలు, గుండం పూజలు, వాహ న పూజలు, నిత్యాన్నదానం పేరుతో సొమ్ము కాజేస్తూ గుండాయిజానికి పాల్పడుతున్నా ఎండోమెంట్ యంత్రాంగం పట్టించుకోవ డం లేదని విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల అండదండలతో వీరు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించారు. గురువా రం ఆలయంలో జరిగిన సంఘటనే ఇందు కు నిదర్శనమని తెలిపారు. గుండం పూజ పేరుతో ఒక అనధికార దళారి పూజారి భ క్తుల వద్ద నుంచి రసీదు ఇవ్వకుండా డబ్బు లు వసూలు చేస్తూ ఇబ్బందులు కలిగించడంతో, భక్తులు ఆలయ చైర్మన్కు ఫిర్యాదు చే శారు.
ఈ క్రమంలో చైర్మన్, అనధికార పూ జారి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇలాంటి అనధికార దళారులు, పూ జారులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయంలో పూజలు పూర్తి గా రసీదు విధానంలోనే నిర్వహించేలా చర్య లు చేపట్టాలని ఎండోమెంట్ అధికారులను రజిని ప్రియ సంతోష్ పటేల్ డిమాండ్ చేశారు.