12 July, 2026 | 1:57 AM

ప్రమాద రహిత విద్యుత్ వ్యవస్థే లక్ష్యం

12-07-2026 12:47 AM

టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ప్రమాద రహిత విద్యుత్ వ్యవస్థే లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రమాదాలను పూర్తిగా నివారించడం, క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని కార్యాలయంలో సురక్ష సేఫ్టీ ఎక్స్‌పో వర్క్‌షాప్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వీ పాటి ల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రాణం సం స్థకు అమూల్యమని, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి, అతివిశ్వాసానికి తావుండకూడదని స్పష్టం చేశారు.