16-02-2026 12:00:00 AM
తుంగతుర్తి, ఫిబ్రవరి15: మహాశివరాత్రి పర్వదినం భాగంగా మండల కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో , శివాలయంలోనూ ఆదివారం రోజున భక్తులు వేకువజామా నిద్రలేచి తలంటి స్థానమాచరించి నూతన వస్త్రాలు ధరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా డప్పు చప్పులతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో విశ్రాంతి ఉపాధ్యాయుడు కీర్తిశేషులు కమలయ్య కుమారుడైన సునీల్ రాతిబండలకు సుమారు 2 లక్షల 50 వేల రూపాయలు దాతగా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. 10116 రూపాయల లడ్డూలను పెండెం లక్ష్మీ రామ్మూర్తి దంపతులు భక్తులకు పంపిణీ చేశారు . దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంభు లింగేశ్వర స్వామి ఉత్సవ కమిటీ సభ్యులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.