calender_icon.png 16 February, 2026 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభ్యుల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు

16-02-2026 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి): నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. ఆదివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం, మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సంధర్బంగా సోమవారం పౌర సేవలను మద్యాహ్నం వరకు నిలిపివేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత కార్యక్రమాల నేపథ్యంలో ప్రజలకు నగరపాలక సంస్థ లోకి అనుమతి లేదన్నారు. ఆస్తిపన్ను చెల్లింపు చేయాలనుకునే వారు ఆన్ లైన్ సేవలను సద్వినియోగం చేస్కోవాలన్నారు. నగరపాలక సంస్థ కు నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నిక భారీ బంధోబస్తు మద్య కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నగరపాలక సంస్థ లో ప్రమాణ స్వీకార ప్రక్రియ ఉదయం 10:30 గంటల 12:30 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం సమావేశ మందిరంలో మద్యాహ్నం వరకు పాలకవర్గ సభ్యులచే మేయర్, డిప్యూటీ మేయర్ ల పరోక్ష ఎన్నిక కొనసాగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.