19 May, 2026 | 9:16 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు గవర్నర్ పురస్కారం

26-01-2026 12:30 AM

జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో అవార్డు అందుకున్న ఆర్‌వీ కర్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి నందుకు గాను హైదరాబాద్ జిల్లా ఎన్నిక ల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయనకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సాంకేతికతను వినూత్నంగా వినియోగించడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డ్రోన్ సర్వైలెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆయ న ప్రత్యేకంగా ప్రస్తావించారు. డ్రోన్ల సాయం తో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం, భద్రతను మరింత పటిష్టం చేయడం ద్వారా ఎ లాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడగలిగారని కమిషనర్‌ను అభినందించారు.