సొంతింటి కల నెరవేరడం వరం
31-08-2026 02:17 AM
అడ్డాకుల ఆగస్ట్ 30: మండలంలోని బలీదుపల్లీ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి (Indiramma's house) నిర్మాణం పూర్తికావడంతో ఆదివారం గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కర్నాకర్ రెడ్డి,ఉప్ప సర్పంచ్ రాధా శివ వార్డు సభ్యులు మంద కృష్ణయ్య, శ్రీనివాసులతో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






