టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
చెన్నై: విజయ్ టీవీకే పార్టీకి(Tamilaga Vettri Kazhagam) మద్దతుపై వీసీకే నేతలు కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. విజయ్ కు మద్దతుపై వీసీకే నేతలు స్పష్టత ఇవ్వనున్నారు. రెండు సీట్లు ఉన్న వీసీకే పార్టీ నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీవీకేకు వీసీకే మద్దతిస్తే తమిళనాడులో(Tamil Nadu Government) ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్(Governor Rajendra Vishwanath Arlekar) ఆహ్వానించే అవకాశముంది. ఇప్పటికే చెన్నైలోని వీసీకే కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఐయూఎంఎల్ టీవీకేకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి మాట తప్పింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికి మెజార్టీ(118) స్థానాలు లేకపోవడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ తమిళ సీరియల్ గా కొనసాగుతోంది. కాసేపట్లో వీసీసకే చీఫ్ తిరుమావళవన్ తో విజయ్ భేటీ కానున్నారు.






