14-02-2026 12:14:24 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన స్టార్ట్ అప్ ‘సోహన్ సితార ప్రైవేట్ లిమిటెడ్’ రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ఆస్ట్రో-టెక్ అనే కొత్త తరహా విభాగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది. రోజువారీ జీవితంలో పంచాంగ వివరాలు, శుభ సమయాలు తెలుసుకోవడానికి పంచాంగ పుస్తకాలు లేదా మొబైల్ యాప్స్ ను తరచుగా చూడాల్సి వస్తుందనే ఒక సా ధారణ పరిశీలన నుంచే ఈ ఆలోచన పుట్టిం ది.
ఆ ఆలోచనే డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ రూపంలో సాకారమైంది. ఇది కేవలం సమ యం చూపించే గడియారం మాత్రమే కాదు.. తిథి, నక్షత్రం, రాహుకాలం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి పంచాంగ వివరాలతో పాటు రోజువారీ దేవత ఫొటోలను ప్రత్యక్షంగా చూపి స్తూ, మన రోజువారీ కార్యక్రమాలను సంప్రదాయం, ఆధ్యాత్మికతకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది.
సోహ న్ సితారా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యం లో ‘ఈక్షన్’ బ్రాండ్‌గా రూపొందిన ఈ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్, ఆధునిక సాంకేతికత తో పాటు భారతీయ పంచాంగం జ్ఞానాన్ని కలిపిన ప్రత్యేక డిజిటల్ గడియారం గా ఎదుగుతోంది. పేటెంట్ కోసం దరఖాస్తు ఇప్పటికే దాఖలు చేయగా ప్రస్తుతం అది పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో ఉంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో పీజీ పూర్తి చేసిన వ్యవస్థాపకుడు వి. శ్రవణ్ కుమార్ రోజువారీ జీవితంలో ఒక సాధారణ లోటును గమనించి ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు.
పంచాంగ సమాచారం పుస్తకాలు, క్యాలెండర్లు, మొబైల్ యాప్స ఉన్నప్పటికీ, అవి విడివిడిగా ఉండటం వల్ల అందరికీ ఒకేసారి అందుబాటులో ఉండడం కష్టమని ఆయన గుర్తించారు. అందుకే ఇంట్లో లేదా కార్యాలయంలో గోడపై ఎప్పుడూ కనిపించే విధంగా ఆ సమాచారాన్ని అందించే ఒక స్థిర పరిష్కారం అవసరమని భావించారు.సాంకేతికత సనాతన సంప్రదాయాన్ని అందరికి మరింత చేరువ చేయడానికి ఉపయోగపడాలి అని శ్రవణ్ కుమార్ పేర్కొంటున్నారు.
డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ద్వారా సమయం, సంస్కృతి, రోజువారీ ప్రణాళిక అన్ని ఒకే చోట సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాం. డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ప్రాచీన హిందూ పంచాంగ సంప్రదాయాన్ని మరింత బలపరిచే విధంగా రూపొందించబడింది. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, కంపెనీ వ్బుసైట్ www.astrowallclocks.com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఈ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. వివిధ రాష్ట్రాల వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడింది.వివరాలకు ఫొన్ నంబర్ 6300505909.