calender_icon.png 14 February, 2026 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సృష్టి’ కేసులో డాక్టర్ నమ్రత అరెస్ట్

14-02-2026 12:16:48 AM

  1. నిందితురాలికి 26 వరకు రిమాండ్
  2. చంచల్‌గూడ జైలుకు తరలించిన ఈడీ

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): వైద్యం పేరుతో వ్యాపారం చేస్తూ, సంతానం కోసం పరితపించే దంపతుల ఆశలను ఆసరాగా చేసుకుని కోట్లు గ డించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలకు ఎట్టకేలకు చెక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సరోగసీ మోసాల కే సులో ప్రధాన నిందితురాలు, డాక్టర్ నమ్రతను  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధి కారులు అరెస్ట్ చేశారు.

సరోగసీ ముసుగులో భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడ టం, మనీలాండరింగ్ ద్వారా ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆమెను అదుపు లోకి తీసుకున్నారు. గురువారం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు ఫిబ్రవరి 26 వరకు జ్యుడీషి యల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సంతా నం లేని దంపతులను టార్గెట్ చేసుకుని డాక్టర్ నమ్రత ఈ దందా నడిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

సరోగసీ ద్వారా బిడ్డను ఇస్తామని నమ్మించి, ఒక్కో దంపతుల నుం చి సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసేవారు. అయితే, నిబంధనల ప్రకారం సరోగసీ ప్రక్రియను చేపట్టకుండా, పేద కుటుంబాలకు చెందిన మహిళల నుంచి అప్పుడే పుట్టిన శిశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఆ శిశువులే సరోగసీ ద్వారా పుట్టారని నమ్మించి దంపతులకు అప్పగించేవారు.

ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ డీఎన్‌ఏ రిపోర్టులు, ఫోర్జరీ పత్రాలను సృష్టించి దంపతులను మోసం చేసేవారని అధికారుల విచారణలో వెల్లడైంది. గత ఏడాది రాజస్థాన్‌కు చెందిన ఓ దంపతులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. వారికి ఒక బిడ్డను అప్పగించారు.

అయితే, ఆ బిడ్డ తమ పోలికలతో లేకపోవడంతో పాటు, ఇత ర కారణాలతో వారికి అనుమానం వచ్చిం ది. దీంతో వారు రహస్యంగా డీఎన్‌ఏ పరీక్ష చేయించగా, ఆ బిడ్డకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ రాకెట్ గుట్టు రట్టయింది.

రూ. 25 కోట్ల అక్రమాస్తులు

శిశు విక్రయాలు, సరోగసీ మోసాల ద్వా రా డాక్టర్ నమ్రత భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన అధికారులు, దాదాపు రూ.25 కోట్ల మేర అక్రమ ఆస్తులను గుర్తించారు. ఈ డబ్బును విదేశాల్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. గత కొన్ని రోజులు గా నమ్రత ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టిన ఈడీ, కీలక ఆధారాలు సేకరించిన అనంతరం అరెస్ట్ చేసింది.

ఈ కుంభకోణం లో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కష్ణ పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే జయంత్ కష్ణతో పాటు పలువురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా అరెస్టుతో ఈ కేసు విచారణ మరింత వేగవంతమైంది. వైద్య వృత్తికే మాయని మచ్చ తెచ్చిన ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.