9 May, 2026 | 10:41 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

చెలరేగిన తీక్షణ, హసరంగ

09-02-2026 02:27 AM

ఐర్లాండ్‌పై శ్రీలంక గెలుపు

కొలంబో, ఫిబ్రవరి 8 : టీ20సొంతగడ్డపై జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్‌పై 20 పరుగుల తేడాతో విజ యం సాధించింది.  ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నిం గ్స్ తడబడుతూ సాగింది. నిస్సాంక (24),  కమిల్ మిశారా(14), రత్నానాయకే (5), వెల్లలాగే (10) పరుగులకే ఔటవడంతో లంక 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఈ దశ లో కుశాల్ మెండిస్, కమిందు మెండిస్ జ ట్టును ఆదుకున్నారు. కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కమిందు మెండిస్ కేవలం 19 బంతుల్లోనే  4 ఫోర్లు, 2 సిక్సర్ల తో 44 రన్స్ చేశాడు. శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మెక ర్తీ 2, డాక్రెల్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్ లో ఐర్లాండ్ త్వరగానే పాల్ స్టిర్లింగ్ (6) వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు.

తర్వా త  రాస్ అడియర్, హ్యారీ టెక్టర్  ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపూ ఐర్లాండ్ లంకకు షాకిచ్చేలా కనిపిం చింది. రాస్ 34 రన్స్ కుఔటవగా.. టక్కర్, టెక్టర్ మూడో వికెట్ కు 49 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఆసక్తికరం సాగింది. అయితే కీలక సమయంలో లంక బౌలర్లు విజృంభించారు. స్పిన్నర్ హసరంగా, పేసర్ తీక్షణ  చెలరేగడంతో ఐర్లాండ్ వరుస వికెట్లు చేజార్చుకుంది. వీరిద్దరి దెబ్బకు ఐర్లాండ్ 143 పరుగులకే ఆలౌటైంది.  హసరంగా,  తీ క్షణ మూడేసి వికెట్లు పడగొట్టారు.