25 June, 2026 | 1:47 PM

Breaking News

ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సీసీరోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాల లోపం   •   మంగనూర్ వాసి దారుణ హత్య   •   నిజాంసాగర్ పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్   •   గట్ల గౌరవరం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   నాగర్‌ కర్నూల్ నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్ రెడ్డి   •   తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం   •   డిజిటల్ అరెస్ట్ ముఠాలపై ఉక్కుపాదం.. 16 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు   •   కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో ముగ్గురు సీఎంల భేటీ   •  

తోక ముడిచిన పాకిస్థాన్

09-02-2026 02:28 AM
  1. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు ఓకే

ఐసీసీ వార్నింగ్‌తో యూటర్న్

లాహోర్ , ఫిబ్రవరి 8 : క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ యథాప్రకారమే జరగనుంది. భారత్ మ్యా చ్‌ను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తోకముడిచింది. ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. గత మూడు రోజులుగా మొండిగా వ్యవహరించిన పీసీబీ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది.

ఐసీ సీ అధికారులతో చర్చలు, శ్రీలంక క్రికెట్ బోర్డు జోక్యంతో మెత్తబడిన పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ ఆడేందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనిపై తమ దేశ ప్రభుత్వంతో చర్చించనున్న పీసీ బీ సోమవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వి వాదంలో ఆదివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాక్ బోర్డుతో చ ర్చించేందుకు  ఐసీసీ అధికారులు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం లాహోర్ వెళ్లారు. దాదాపు నాలు గు గంటలకు పైగా సాగిన సమావేశంలో పాక్ బోర్డు పలు డిమాండ్లను కూడా ఐసీ సీ ముందుంచినట్టు తెలుస్తోంది.

తమకు వచ్చే రెవెన్యూ వాటాను పెంచడం, భారత్ తో ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ విషయంలో ఒత్తిడి తీసుకురావడం వీటిలో ప్రధానంగా ఉన్నాయి. కానీ ఐసీసీ మా త్రం రెవెన్యూ వాటా విషయంలో ఇతర బోర్డులతో చర్చించాకే చెబుతామని తెలిపింది. అదే సమయంలో భారత్ తో ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో తామేమీ చేయలే మని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులతో ముడిపడి ఉన్న అంశంగా పేర్కొంది.

ఈ సమావేశంలో ఐసీసీ అధికారులు భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తే జరగబోయే పరిణామాల గురించి మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోం ది. రెవెన్యూ వాటా సంగతి అటుంచితే బ్రాడ్ కాస్టర్లకు, స్పాన్సర్లకు ఎవరు సమాధానం చెబుతారని ఐసీసీ తీవ్రంగా స్పం దించడం, ఇక్కడ నుంచీ పాక్ బోర్డు వెనక్కి తగ్గి తమ ప్రభుత్వంతో చర్చించాక నిర్ణ యం ప్రకటిస్తామని తెలిపింది.

కాగా బం గ్లాదేశ్ లో హిందువుల హత్యలకు నిరసనగా ఐపీఎల్ నుంచ ముస్తాఫిజుర్ రహ మాన్‌ను తప్పించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతీకార చర్యగా బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్ కు చోటు దక్కింది. అదే సమయంలో బంగ్లాకు మద్ధతుగా పాక్ భారత్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ఐసీసీతో పాటు బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించాయి. భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి రానుండడంతో ఎట్టకేలకు పాక్ బోర్డు తోక ముడి చినట్టు స్పష్టమైంది.