ఉద్యమకారుల సన్మాన సభను విజయవంతం చేయాలి
జేఏసీ చైర్మన్ మాలి ధర్మ పాల్ రెడ్డి
మిర్యాలగూడ, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తొలి, మలిదశ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమం సందర్భంగా మిర్యాలగూడలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజకీయ జేఏసీ చైర్మన్ మాలి ధర్మ పాల్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక అమరవీర స్తూపం వద్ద ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర దినోత్సవ సంద ర్భంగా ఉద్యమించిన ఉద్యమకారులను సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల నుండి ఉద్యమకారులు కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ ఉద్యమకారుల ఎంపిక కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సభ్యులు మోతే శోభన్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ శంకర్, నాయకులు హాజరవుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ జాడి రాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథనాయక్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొప్పని నగేష్, సర్పంచ్ బెజ్జం సాయి,టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు జెఏసి నాయకులు కొండారపు నాగేశ్వరరావు, శ్రీనివాస్, రాజ్ కుమార్, నీలకంఠం నాయక్ లింగా నాయక్, రాము, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






