27 July, 2026 | 6:34 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

సమసమాజ స్థాపనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

03-06-2026 01:44 AM

బండి రమేష్.

కూకట్ పల్లి, మే2,(విజయక్రాంతి):సమ సమాజ స్థాపనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని బండి రమేష్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంగళవారం కూకట్ పల్లి నియోజకవర్గం పరిధి బోయినపల్లి,బాలానగర్, ముసాపేట, అల్లాపూర్ డివిజన్ల పరిధిలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొ ని జాతీయపతకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సకలజనుల పోరాటం తోనే తెలంగాణ రాష్ట్రం సాకారమయిందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో దోచుకోవటం దాచుకోవటం తరహా పాలన సాగిందని ద్వజమెత్తారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని, అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. మహిళలను మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో కోటి మంది మహిళలను కోటీశ్వ రులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. 

మహిళలను కోటీశ్వరులను చేయడంలో భాగంగా పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, అద్దె బస్సులను కేటాయిస్తున్నామన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఇల్లులేని ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అద్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.