3 July, 2026 | 6:19 PM

Breaking News

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్   •   జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •  

బసవేశ్వరుని సారం భావితరానికి ఆదర్శం

21-04-2026 12:00 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ళ ఏప్రిల్ 20(విజయక్రాంతి): బసవేశ్వర బోధనలు నేటి తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వీర శైవ లింగాయత్ సంఘం మండల అధ్యక్షులు మాజీ వైస్ ఎంపిపి కర్నే శివప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవల కొనియాడారు.

మహనీయులకు కులం మతం ఉండదన్నారు. మనిషిని మనిషిగా ప్రేమించడమే మహనీయుల తత్వం అన్నారు. అనంతరం కౌన్సిలర్లు మనీషా అనంత్ రెడ్డి, మీనాక్షి సత్యనారాయణ, పెద్దోళ్ల దయాకర్ మాట్లాడుతూ... కుల, లింగ, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వం దేశంలో ప్రభావం చూపాయన్నారు. బసవేశ్వరుని జయంతి సందర్భంగా వారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వారు మాట్లాడుతూ... 12వ శతాబ్దపు తత్వవేత్తగా బసవేశ్వరుడు సమానత్వాన్ని బోధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్, వై చైర్మన్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మూడుమేళ్ల మాజీ పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత్ రెడ్డి, జిల్లా యువ నాయకులు మల్గారి వైభవ్ రెడ్డి వివిధ పార్టీల నాయకులు సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.