21 April, 2026 | 4:07 AM

విద్యార్థులకు బాధ్యతాయుత విధానంపై అవగాహన

21-04-2026 12:00 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం, ఐఈఈఈ క్యాంపుటేషినల్ ఇంటలిజెన్స్ సొసైటీ  స్టూడెంట్ చాప్టర్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 6 సంయుక్త ఆధ్వర్యంలో ఎథికల్ అండ్ సేఫ్ యూస్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్ అనే అంశంపై అవుట్రీచ్ కార్యక్రమాన్ని జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ కవాడిపల్లిలో నిర్వహించారు. 

ఈ కార్యక్రమం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏఐ ఆధారిత అభ్యాస సాధనాలను నైతికంగా,  బాధ్యతాయుతంగా ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించేందుకు ఈకార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు. సమావేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాథమిక భావాలను సులభంగా ఆసక్తికరంగా వివరించి, ఏఐ ఎలా పనిచేస్తుంది, విద్యా రంగంలో, దైనందిన జీవితంలో దానిని ఎలా సురక్షితంగా ఉపయోగించుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందించిన యాజమాన్యం,  ఉన్నతాధికారులకు విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన అనుమతులు మంజూరు చేసిన డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కి, ఎన్‌ఎస్‌ఎస్ యూనివర్సిటీ కో-ఆర్డినేటర్ డాక్టర్ మల్లేశ కి, యూనిట్6 ప్రోగ్రామ్ ఆఫీసర్, విభాగ ఫ్యాకల్టీ కో- ఆర్డినేటర్ టి. బాలకృష్ణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.