25 July, 2026 | 6:00 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

నేటి నుంచి ఎల్లారం పోచమ్మ జాతర

04-02-2026 01:01 AM

బెజ్జూర్, ఫిబ్రవరి ౩ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మత్తడి స్వింగానకట్ట సమీపంలో ఎల్లారం పోచమ్మ అమ్మవారి జాతర, బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జిల్లాల సుధాకర్ గౌడ్ తెలిపారు. అడవిలో వెలసిన అతి పురాతనమైన ఎల్లారం పోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు రెండోసారి ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఈనెల 4 వ తేదీ, అఖండ జ్యోతి ప్రజ్వలన ఉదయం 9 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ మహంకాళి దేవాలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి, సత్యనారాయణ శాస్త్రి, దీకొండ అశోక్ చారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ తేదీన ఉదయం 11 గంటలకు అమ్మవారికి బోనాల సమర్పణ, అనంతరం అమ్మవారి కి మొక్కల చెల్లింపు కార్యక్రమాలు ఉంటుందని ఆలయ కమిటీ అధ్యక్షులు జిల్లాల సుధాకర్ గౌడ్ తెలిపారు.