20 April, 2026 | 9:56 PM

Breaking News

మాజీ ఎమ్మెల్యే సురేందర్ అసత్య ప్రచారాలు మానుకోవాలి   •   కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం   •   పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి   •   టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి   •   డీలిమిటేషన్ బిల్లు వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర   •   యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలు   •   చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •  

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

09-10-2025 08:22 PM

సూర్యాపేట ఆర్డిఓ వేణు మాధవరావు..

పెన్ పహాడ్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ రావు అన్నారు. గురువారం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను ఆర్డీఓ వేణుమాధవ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు, అభ్యర్థుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఫర్నిచర్, భద్రతా చర్యలను త‌నిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య రిటర్నింగ్ అధికారి నారాయణ దాస్ రమేష్ తహసీల్దార్ దారవత్ లాలూ నాయక్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.