4 May, 2026 | 12:26 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

గడప గడపకు రాజ్యాంగం

17-12-2025 06:01 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): సామాన్య ప్రజలకు చట్ట అవగాహన, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి అంశాలపై చైతన్యం కల్పించడానికి స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ఎన్. కృష్ణ వేణి అన్నారు. గడప గడపకు భారత రాజ్యాంగం కార్యక్రమంలో భాగంగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు లు బుధవారం ఘట్ కేసర్ లోని వారి నివాసంలో రాజ్యాంగం పుస్తకం అందజేశారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ప్రతి పౌరుడు సోదరభావం, సౌభ్రాతృత్వం పెంపొందించుకునే విధంగా రాజ్యాంగం పట్ల అవగాహన ఎంతో అవసరమని అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ నుండి రాజ్యాంగం పుస్తకం అందుకున్న వారు మరో ఇద్దరికి అందించలని ఇలా ప్రతి ఇంటిలో రాజ్యాంగం ఉండే విధంగా చేస్తున్న ప్రయత్నం హర్ష నీయమని, ఆర్గనైజేషన్ సభ్యులను అభినందించారు.