2 April, 2026 | 3:56 AM

ఇందిరమ్మ ఇళ్ళతో నెరవేరనున్న పేదల కల

02-04-2026 12:00 AM

గృహప్రవేశం చేసిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు కారదరపు పల్లవి, విశాల్ నూతనంగా నిర్మించుకున్న ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం వైభవంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఇళ్ల గృహప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల కు టుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాలు వారి జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎంపీడీ వో రవీందర్, ఎంఆర్‌ఐ ఇమ్రాన్ ఖాన్, ఏఈ హర్ష, జీపీఓ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ సుప్రియ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.