8 June, 2026 | 2:58 AM

సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం

08-06-2026 12:24 AM

అలంపూర్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని టెలికం అడ్వైజరీ కమిటీ మాజీ మెంబర్ ఇస్మాయిల్ అన్నారు.ఆదివారం అలంపూర్ పట్టణ కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకున్న అనూష  సతీశ్ దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు కోసం ఎదురుచూసిన నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు.

ముఖ్యమంత్రి నాయకత్వంలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తు న్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాజ్యలక్ష్మి, సురేష్, స్వాతి, రజిని బాబు ఎల్లన్న పాల్గొన్నారు.