వంటగ్యాస్ ధరలను తగ్గించాలి
బీఆర్‌ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ మహిళలు
ఎల్బీనగర్, జూన్ 7 : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచి, దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మరోసారి ఆర్థిక భారం మోపిందని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. కేవలం మూడు, నాలుగు నెలల్లో గ్యాస్ ధరను రూ, 89 పెంచారని తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఎల్బీనగర్ చౌరస్తాలో మహిళా నాయకురాలు గ్యాస్ ధరను తగ్గించాలని కట్టెల పొ య్యి మీద వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, విద్యా, వైద్య ఖర్చులు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






