ఫలితాల్లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఘన విజయం
కరీంనగర్ క్రైమ్, జూన్ 7 (విజయక్రాం తి) : మారుతున్న అభ్యర్థుల ఎంపిక విధానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ద డంలో శ్రద్ధ వహిస్తోంది ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. విద్యార్థులకు ప్రశ్నల సరళిపై ,కఠినతా స్థాయిలపై అవగాహన పెంపొందేలా ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారి అభ్యాసన సామర్థ్యాలు పెంచుకునేలా, వారిలోని లోపాలు తెలుసుకుని సవరించుకునేలా గ్రాండ్ టెస్టులని నిర్వహిస్తూ పరీక్ష ల్లో విజయం సాధించేలా నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ.ప్రతి ఒక్క రికి ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యం వుం డాలి, దానికోసం నిరంతరం కృషి చేయాలి, చేసే పనిని తపస్సుతో భావించాలి.
అప్పుడే ప్రతి ఒక్కరు విజయం సాధించగలరు.ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ లక్ష్యాలపై దృష్టి పెట్టేలా వాటి సాధనకై నిరంతరం కృషి చేసేలా ప్రోత్సహిస్తూ వారి పరీక్షలకి అనుగుణంగా శారీరక, మానసిక అభ్యాసాలని విద్యార్థులకి అందిస్తుండడం వలన మా అకాడమీ విద్యార్థులు రాత, శారీరక పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు.
ఇంతటి విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి, సి బ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలోనే అత్యున్నత భోధనా ప్ర మాణాలతో శిక్షణని అందిస్తూ అన్ని ఆర్మీ ర్యాలీలలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న మా అకాడమీలో సైనిక ఉద్యోగాల ఆశావహు, నిరుద్యోగులు చేరి ఉద్యోగులుగా మారాలని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొ త్త సతీష్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం,సిబ్బంది పాల్గొన్నారు.






