వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే
- వ్యక్తిగత ఆర్థిక సహాయం అందజేత
నెరడిగొండ,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నెరడిగొండ మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్, ఈశ్వరి బాయి ఇండ్లు గురు వారం కూలిపోగా విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంటనే ఇండ్లను పరిశీలించారు. తక్షణ ఆర్థిక సహాయం సైతం అందజేశారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయిన వారి జాబితాను సిద్ధం చేయాలని, నష్టపరిహారం కొరకు నివేదిక అందజేయాలని తహశీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు. మండలంలో ఎక్కడ ఎవరికి నష్టం కలిగిన వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఎంఎల్ఏ వెంట సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, నాయకులు సాబ్లే సంతోష్, రాథోడ్ సురేందర్, సుజీల్, ప్రతాప్ తదితరులున్నారు.






