పేదలకు సొంతింటి కల సాకారం..
వెల్దుర్తి, మార్చి 15 : పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పేదల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ రెడ్డి, బంజరవి, నాయకులు తలారి అన్వేష్, మల్లేష్, సుధాకర్ గౌడ్, శేఖర్ గౌడ్, వెల్దుర్తి పట్టణ అధ్యక్షుడు అవుసుల మల్లేష్ చారి, మాజీ సర్పంచ్ గుత్తి కిషన్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




