గెస్ట్ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
మునిపల్లి,(విజయకాంత్రి): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో గల తెలంగాణ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో గెస్ట్ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ లెక్చలర్స్ ఇంగ్లీష్, లెక్చరర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూలజీ, పిజిటి తెలుగు, పిజిటి హిందీ, పిజిటి
ఇంగ్లీష్, పిజిటి
మ్యాథ్స్, పిజిటి
ఫిజికల్ సైన్స్, పిజిటి
బయో సైన్స్, టీజిటి
ఇంగ్లీష్, టీజిటి
మ్యాథ్స్, టీజిటి
సోషల్, పిడి వ్యాయామ ఉపాధ్యాయుల కోసం అర్హతలు గల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన డిగ్రీ, బి.ఎడ్, టెట్, పిజి, ఇతర సంబంధిత సర్టిఫికెట్లతో ఈనెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు లింగంపల్లి గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే జూన్ 2న ఉదయం 10 గంటలకు డెమో కం ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.






