28 June, 2026 | 1:53 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ప్రజా పాలనతో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలి

13-03-2026 12:53 AM

రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్, మార్చి 12 (విజయక్రాంతి)ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలపాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అవగాహన సదస్సును మంత్రి ప్రారంభించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ , ఎమ్మెల్యేలు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి , చిక్కుడు వంశీ కృష్ణా , కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.