సమస్యలు కనబడవా?
- రైతు భరోసా రూ.12 వేలకే పరిమితం చేశారు
- ఫీజు బకాయిలు, జాబ్ క్యాలెండర్ ఏవీ?
- రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ..
- ఆసరా పెన్షన్ల కోసం ప్రజల నిరీక్షణ
- మీ చేతిలో గడ్డపార పట్టుకున్నప్పటి నుంచి ప్రజలకు నిద్రలేని రాత్రులే..
- కేసీఆర్ తన బాధ్యతను విస్మరించారు
- ప్రజల గొంతుకగా బీజేపీ ప్రజల సమస్యలను మీ దృష్టికి తెస్తుంది
- సీఎంకు లేఖ రాసిన రాంచందర్ రావు
హైదరాబాద్, మార్చి 12 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఏసీ గదుల నుంచి సీఎం బయటకువచ్చి గ్రౌండ్ రి యాలిటీని చూసి సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్ రావు తెలిపారు. రైతు భరోసా రాక రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపా రు.
పదవీ విరమణ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, ఆసరా పెన్షన్ల కోసం వృద్ధులు, ఒంటరి మహిళ లు, దివ్యాంగులకు ఇచ్చిన హామీ లు నీటిమూటలయ్యాయని తెలిపారు. మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టుల పేరుతో వేలాది మంది ప్రజల ఇండ్లను కూల్చుతున్నారని విమర్శించారు.
ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజల సమస్యలపై మాట్లాడే బాధ్యతను విస్మరించారని, అందు కే తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ ఈ సమస్యలపై మీ (సీఎం) దృష్టికి తెస్తోందం టూ సీఎం రేవంత్‌రెడ్డికి రాంచందర్ రావు గురువారం బహిరంగ లేఖ రాశారు.
ముఖ్యమంత్రి అయ్యాక మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా పోయిందని మీరు చేసిన వ్యాఖ్య నిజంగా ఆలోచింపజేసిందని, ఒకవైపు మీ నిజాయితీని అభినందించాల్సి ఉన్నా, మరోవైపు ప్రజల పరిస్థితిని గుర్తించి ఆవేదన కలుగుతుందన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యమో లేక కారణమేదైనా, నేడు తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న కష్టాలు మీ దృష్టికి రాకపోవడం దురదృష్టకరమన్నారు.
మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజె క్టు ఏర్పాటుకోసం మీరు (సీఎం) చేతిలో గడ్డపార పట్టుకున్నప్పటి నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. ఇక ఖమ్మం శివారు వెలుగుమట్లలో దాదాపు 800 ఇం డ్లు కూల్చివేసి నిర్దాక్షిణ్యంగా ఆ కుటుంబాలను రోడ్డునపడేస్తే వాళ్ల ఆవేదన, అక్కడి గ్రౌండ్ రియాలిటీ మీకు తెలియకపోవడం బాధాకరమన్నారు.
ఫండింగ్ ఒత్తిడితో..
వివిధ రాష్ట్రాలలో త్వరలో జరిగే ఎన్నికలకు ఇక్కడ నుండే ఫండింగ్ చేయాలన్న మీ పార్టీ అధిష్ఠానం ఒత్తిడి వల్ల కూడా నిరుపేదలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు, ఆసరా పెన్షనర్ల కష్టాలు మీ దృష్టికి రాకపోవచ్చన్నారు. మీరు చెప్పిన గ్రౌండ్ రియాలిటీ తగ్గిపోయింది అనడానికి రైతులే నిదర్శనమని, ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వకుండా, దానిని రూ.12 వేలకే పరిమితం చేసి, అదికూడా సమయానికి ఇవ్వ డం లేదని లేఖలో వివరించారు.
నవంబర్ -డిసెంబర్‌లో పడాల్సిన యాసంగి డబ్బులు రాక రైతులు అప్పుల పాలవుతున్నారని, పె ట్టుబడి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రాజెక్టుల నీళ్లు కాల్వలకు రాక పం టలు ఎండిపోతుంటే, భరించలేని అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని పేర్కొన్నారు.
విద్యాశాఖ మీవద్దే ఉన్నా..
విద్యాశాఖను మీరే నిర్వహిస్తున్నా అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వేల కోట్ల లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. దీంతో పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యా లెండర్ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సి ంది పోయి, విద్యా కమిషన్ ద్వారా టీచర్ల జీ తాలు తగ్గించేలా నివేదిక తెప్పించడం వారి లో భయాందోళనలు కలిగిస్తోందన్నారు.
పెండింగ్‌లో బెనిఫిట్స్..
దశాబ్దాల పాటు సేవచేసిన ఉద్యోగులు నేడు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, సుమారు రూ. 12 వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వైద్యానికి డబ్బుల్లేక మైసయ్య (ఖమ్మం), ఖాజా మొయినుద్దీన్ (కొత్తగూడెం) వంటి సుమా రు 60- మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రా ణాలు కోల్పోయారన్నారు. కార్డులు పనిచేయక, క్యాష్‌లెస్ చికిత్స అందక వేలాది మం ది అవస్థలు పడుతున్నారని లేఖలో వివరించారు.
పెన్షన్ ఏమైంది?
వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరు ఇచ్చిన హామీలు నీటి మూటల య్యాయని, రూ. 2,016 ఉన్న పెన్షన్‌ను రూ. 4,016కు, దివ్యాంగులకు రూ. 6,016 కు పెంచుతామన్న హామీ రెండేళ్లయినా అమలుకాలేదన్నారు. పెన్షన్లు నెల చివరలో లేదా మరుసటి నెలలో అందుతుండటంతో మందులు కొనడానికి కూడా పృద్ధులు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు.
మున్సిపల్ పాలన వైఫల్యం..
పట్టణాల్లో ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఉందన్నారు. పట్టణాలు కుక్కలు, కోతులు, పందుల బెడదతో నిండిపోయి, ప్రజలపై దాడులు జరుగుతున్నా యన్నారు. పట్టణాలు, నగరాల్లో దోమలు, కోతులు, కుక్కలు, పందుల స్వైరవిహారంతో జనం విలవిల్లాడుతున్నారని మురుగునీటి వ్యవస్థలు సరిగా లేకపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు.
కుప్పకూలిన వైద్య ఆరోగ్య వ్యవస్థ..
ప్రభుత్వ దవాఖానల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. జడ్చర్ల ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్క లు పీక్కుతినడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లలో స్థానికత గందరగోళం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిర గాల్సి పస్తోందన్నారు. ప్రజల గొంతుకగా భారతీయ జనతా పార్టీ ఈ సమస్యలను మీ దృష్టికి తెస్తోందని, ఇప్పటికైనా మీ ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ రియాలిటీని చూడాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీఎంకు రాసిన లేఖలో రాంచందర్ రావు కోరారు.




