20 May, 2026 | 3:47 AM

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

20-05-2026 12:00 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బూర్గంపాడు,మే19(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.మంగళవారం బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్, భాస్కర్ నగర్ ప్రాంతాల్లో సుమారు 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం భూక్య అరుణ, తేజావత్ జానకి లు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి,పిఆర్ ఏఈ చక్రధర చారి,విద్యుత్ శాఖ ఏఈ ఉపేందర్,జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్ కుమార్,మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మహిముద్ ఖాన్, సర్పంచులు కిషోర్ నాయక్,మందా నాగరాజు,నాయకులుకైపు శ్రీనివాస్ రెడ్డి, భజన ప్రసాద్, ఇంగువ రమేష్, చల్లా వెంకటనారాయణ,తిరుపతి చంటి తదితరులు పాల్గొన్నారు.