కూసుమంచిలో మోదీ దిష్టిబొమ్మ దగ్ధం
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం డిమాండ్
కూసుమంచి, మే 19 (విజయక్రాంతి): కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచి సామాన్యుల నడ్డి ఇరుస్తుందని పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మాతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం మండల కేంద్రం లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా సిపిఎం పార్టీ ఆఫీస్ నుండి మండల కేంద్రం వరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఆటో కి తాడ్లు కట్టి మండల సెంటర్ వరకు లాగారు. ఈ సందర్భంగా సన్మతరావు మాట్లాడుతూ.. మోడీ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పెట్రోల్, డీజిల్ రేటు పెంచి తన బుద్ధుని చాటుకున్నాడని ఆయన విమర్శించారు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు.
సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, సిపిఎం సీనియర్ నాయకులు శీలం గురుమూర్తి, పాలేరు డివిజన్ కమిటీ సభ్యులు బిక్కసాని గంగాధర్,హళావత్ నరసింహ, నాయకులు ఎల్లంపల్లి అశోక్, పడిశాల శేషయ్య, ఎర్రబోయిన సురేష్, జవ్వాజి శ్రీను, ఉప్పయ్య, ఉన్నం బాబురావు, నవీన్, వీరబాబు, వీరన్న, నాగేశ్వరరావు, ప్రసాద్, వెంకటేశ్వరరావు, వెంకటనారాయణ, శ్రీను, వెంకన్న, పాల్గొన్నారు






