3 July, 2026 | 11:17 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

18-11-2025 12:59 AM

-ఫ్లై ఓవర్ పనుల్లో జాప్యంపై ఎంపీ ఈటల సీరియస్ 

మేడ్చల్, నవంబర్ 17 (విజయ క్రాంతి): కొంపల్లిలో ఫ్లై ఓవర్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కొంపల్లి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. 2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన పనులు ఇప్పటివరకు సగం కూడా పూర్తికాలేదు.

దీంతో ఈటల కాంట్రాక్టర్, నేషనల్ హైవే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫ్లైఓవర్ పనుల్లో జాప్యం వల్ల ఎంతో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. ప్రాణాలు పోతున్న పట్టించుకోరా’? పని చేతకాని కంపెనీ ఎందు కు టెండర్ వేసింది, అధికారులు ఏం చేస్తున్నారు, ఇలాంటి వాళ్లను జైలులో పెట్టిం చాలి, పనులు ఇలాగే జాప్యం చేస్తే ప్రజల చేతిలో దెబ్బలు తింటారని హెచ్చరించారు.