14 July, 2026 | 6:21 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

సీఆర్పీ రమేష్ మృతి బాధాకరం

30-12-2025 01:05 AM

హుజూర్ నగర్, డిసెంబర్ 29: సిఆర్పి రమేష్ మృతి అత్యంత బాధాకరమని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. మండల పరిధిలోని  లింగగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్పి రమేష్ గత రెండు నెలల క్రితం మృతి చెందాడు. హుజూర్ నగర్ మండలంలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరూ,ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు జిల్లా స్థాయి సిఆర్పిలు, ఎంఆర్సి సిబ్బంది సహృదయంతో తోటి ఉద్యోగస్తుడు  మృతి చెందడంతో బాధిత కుటుంబానికి అండగా నిలిచి 2 లక్షల 20వేలు పిక్స్ డ్ డిపాజిట్ ను  సోమవారం డిఈఓ అశోక్  చేతులమీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా డిఈఓ అశోక్ మాట్లాడుతూ... సిఆర్పి రమేష్ కుటుంబానికి జిల్లా విద్యాశాఖ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భూక్య సైదా నాయక్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి,పెనుగొండ శ్రీనివాస్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.