పసిపాప మృతి ప్రభుత్వ హత్యే!
పరిపాలనపై పట్టుకోల్పోయిన సీఎం రేవంత్
పేదలు, రైతులు, విద్యార్థులు, సామాన్యులపై అక్రమ కేసులు
కుమ్మెర ఘటన జరిగి ఏడురోజులైనా కలెక్టర్, ఎస్పీ స్పందించకపోవడం దారుణం: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన కులహంకార దాడిలో రెండు నెలల పసిబిడ్డ మృతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇది ప్రభు త్వ హత్యగానే భావిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ లో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో ఆయ న పాల్గొని బాధితులను పరామర్శించా రు.
అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలనపై పట్టుకోల్పోయారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో స్థానిక పోలీసులు, అధికారులు.. ఎమ్మెల్యేల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. ప్రజాపాలన కాకుండా తమకు అవసరమొచ్చిన రీతిలో పరిపాలిస్తూ నిరుపేదలు, రైతులు, విద్యార్థులు, సామాన్యుల పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరో పించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఒక్క అధికారి పనిచేయడం లేదని మండిపడ్డారు. అన్యాయం జరిగిందని ఫిర్యాదులు చేసిన బాధితులపైనే కేసులు పెట్టి ముద్దాయిలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కుమ్మెర గుట్ట పైన అక్రమ వసూళ్లు గొడవకు కారణమవడం దురదృష్టకరమన్నారు. దేవాదాయ శాఖ దీనిపై పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఏడు రోజులు అవుతున్నా కలెక్టర్, ఎస్పీ స్పందించకపోవడం దారుణం అన్నా రు.
వారిపై చర్యలు తీసుకునేందుకు జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీలోను ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ కార్యాచరణ చేపడుతుంద న్నారు. ఆయన వెంట బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, పార్లమెంటు కంటెస్టడ్ అభ్యర్థి భరత్ ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు ఉన్నారు.
బీజేపీలో బయటపడ్డ అసంతృప్తి!
ఇతర పార్టీ నుంచి వలస వచ్చిన నాయకుడు నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీలో ప్రధాన పాత్ర పోషిస్తూనే, ము న్సిపాలిటీ ఎన్నికల్లో ఇతర పార్టీ ము డుపులకు ఆశపడి పార్టీకి నష్టం చేశారని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ముందే బీజేపీ కార్యకర్తలు తమ గో డు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థు లకు వెన్నుపోటు పొడిచారని, గెలిచే స్థానాలను కూడా పోగొట్టుకోవడానికి కారణం అయ్యారని ఆరోపిం చారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని రాంచందర్‌రావు హామీ ఇచ్చారు.




