3 August, 2026 | 10:28 AM

ఊరడమ్మ పండుగలో ఇందూరు

03-08-2026 09:25 AM

పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు 

ప్రముఖుల సందడి, ఖిల్లా నుంచి దేవత మూర్తుల ఊరేగింపు 

సరి కోసం తోపులాట,  పోలీసుల బందోబస్తు 

నిజామాబాద్,(విజయక్రాంతి): ఊర  పండగ సంబరాలతో ఇందూరు పులకించింది. ఖిల్లా శారదాంబ గద్దె పై దేవత మూర్తులను ప్రతిష్టించారు. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఊర పండగ ఉత్సవాలు ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఖిల్లా నుంచి దేవత మూర్తులను తయారుచేసి ఊరేగింపుగా నగరంలో నీ పలు కాలనీలో ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలతో, శివసత్తుల పూనాకాలతో ఊర పండుగ సందడిగా మారింది. సర్వ సమాజ్, కుల సంఘాల ఆధ్వర్యంలో ఊర పండగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సరి కోసం పోటి పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కార్పొరేషన్ చైర్పర్సన్ ఉమారాణి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద కార్పొరేటర్లు, కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఇందూరు ఊర పండుగ ఉత్సవాలతో పులకించింది. పోతరాజుల విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి.