అనుమతి పేరుతో అదనపు దోపిడీ
ట్రాక్టర్లుతో జోరుగా అక్రమ రవాణా
ఒక్క ఓటిపి పేరుతో 5 ట్రాక్టర్లు ఇసుక
ప్రజా ప్రతినిధులు అండతో పెరిగిన దందా
సర్కారు ఆదాయానికి గండి
అడ్డాకుల ఫిబ్రవరి 24: అనుమతి పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అడ్డాకుల మండల కేంద్రంలో కన్మనూరు పరిధిలో ఉన్న వాగుల నుంచి దర్జాగా తోడేస్తున్నా అడిగేవారు. లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా జోరుగా ప్రజా ప్రతినిధుల అండ దందా నడుస్తోంది. నిబంధనలకు ఆన్లైన్ ఇసుక ద్వారా చేస్తున్నా రెవెన్యూ, శాఖ అధికారులు ఒక్క కేసూ నమోదు చేయకపోగా ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అవసరాల కోసమంటూ సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు జరుగకపోయినా పట్టపగలే ఆన్లైన్ పేరుతో 40 నుండి సంఖ్యలో ట్రాక్టర్లలో మండల కేంద్రంలోని ప్రగతి స్పిన్నర్స్ కంపెనీకి కమర్షియల్ నిర్మాణాలకు ఇసుక 100 ట్రిపుల్ తరలించారు. ఆన్లైన్ పేరుతో ఒక ఓటిపి తో ఐదు టాక్టర్లు ఇసుకను అక్రమంగా. ట్రాక్టర్ల యజమానులే దోపిడీ తీరుకు అద్దంపడుతుండగా, అధికారుల వైఖరితో సర్కారు ఆదాయానికి గండి పడుతోంది.
ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే నిరుపేదలకు ఇసుక స్లాట్ బుక్ చేసుకొని డిడి కట్టిన నెలలు గడుస్తున్న కూడా ఇందిరమ్మ ఇండ్లకు నెలలు గడిచిన ఇసుక ఇసుక దొరకక అవసరాలకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇందిరమ్మ ఇండ్లకు మాత్రం కొంత పరిమితి పెట్టారు. కానీ కమర్షియల్ ఎన్ని ట్రిప్పులన్న చేసుకోవచ్చా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుంటే ఒకటే కంపెనీకి 100 ట్రాక్టర్లు ట్రిప్పులు ఎలా స్లాట్ అవుతుంది. ఒకే అడ్రస్ కు 100 నుండి 200 ట్రిప్పులు ఇసక పర్మిషన్ ఇస్తున్నారు. సామాన్యునికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి మాత్రం స్లాట్ బుక్ చేసిన ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి ఇట్టి విషయంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




