సౌత్ ఇండియా కరాటే పోటీల్లో కోదాడ విద్యార్థుల సత్తా
03-08-2026 09:06 AM
కోదాడ ఆగస్టు 02( విజయ క్రాంతి): ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ లీగ్‌లో కోదాడ శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన కోఫోకన్ కరాటే క్లబ్ విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చి పలు పతకాలు కైవసం చేసుకున్నట్లు కోచ్ ఆరె మాధవీలత తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. వారి కృషి ఫలితమే ఈ విజయం అని తెలిపారు. విజేతలకు పోటీల చీఫ్ ఆర్గనైజర్ సయ్యద్ మహమ్మద్ పాషా, వైస్ ప్రెసిడెంట్ మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.






