3 August, 2026 | 10:10 AM

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

03-08-2026 09:04 AM

ఎస్సై సీతపాండు

సంస్థాన్ నారాయణపూర్,ఆగస్టు 02(విజయ క్రాంతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నారాయణపురం ఎస్సై సీతపాండు అన్నారు.ఆదివారం నారాయణపురం మండలకేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు అవశ్యకతను వ్యాపారస్తులకు ప్రజలకు వివరించారు.ప్రస్తుతం జరుగుతున్న నేరాలను వివిధ కేసులలో సీసీ కెమెరాల వలన జరిగిన లాభాన్ని వివరించారు.వర్తకులు తమ వ్యాపార సముదాయాలలో సీసీ కెమెరాలను తప్పక మార్చుకోవాలని తెలిపారు.గతంలో జరిగిన అనేక నేరాలలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించామని తెలిపారు.వర్తకసంఘం నాయకులు,యువజన నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.