పాఠశాలకు చేయూత అభినందనీయం
జిల్లా జడ్జి శ్రీవాణి
నిర్మల్, మార్చి ౧౦ (విజయక్రాంతి): ప్రభు త్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు పేదవారే కావడంతో వారికి చేయూత అందించేం దుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు.
మంగళవారం ఉన్నత పాఠశాల కస్బాలో దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వాటర్ ప్యూరిఫై మిషన్ను పంపిణీ చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా నిర్మల్ జిల్లా జడ్జి లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు.
పాఠశాలలో స్థానిక సమస్యలపై విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ రాధిక అలాగే డిఇఓ భోజన్న ప్రధానోపాధ్యాయులు వాని మేడం ఎన్జీవో చైర్మన్ మహేష్ ఆదిత్య హాస్పిటల్ ప్రమోద్ చంద్ర, ఉపాధ్యాయ బృందం అలాగే జిల్లా కోర్టు అధికారులు పాల్గొన్నారు




