18 July, 2026 | 12:30 AM

సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

18-07-2026 12:00 AM

మాజీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 17(విజయక్రాంతి): సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అధికారులను కోరారు. గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో,   చిక్కడపల్లిలోని సుధాదర్శిని హోటల్ ప్రక్కన వీధిలోని  ప్రధాన రహదారి  వద్ద జీహెచ్‌ఎంసి  కార్పొరేటర్ పాత బడ్జెట్ రూ. 2 కోట్ల నిధుల నుండి రూ. 26 లక్షలు కేటాయించి, గతంలో ప్రారంభించిన నూతన సీసి రోడ్డు నిర్మాణం పనులను  శుక్రవారం గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్  ఎ.పావని వినయ్ కుమార్ స్థానికులు  బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత15 సంవత్సరాలుగా అద్వాన స్థితిలో వున్న రోడ్ల ద్వారా  స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేసిన ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించి నూతన సీసి రోడ్డు నిర్మాణం కొరకు అనుమతి పొంది తమ పాత  కార్పొరేటర్ బడ్జెట్ నుండి 26 లక్షల నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని మాజీ కార్పొరేటర్ వివరించారు. ప్రత్యేక కృషితో నూతన సీసి రోడ్డు నిర్మాణం జరుగుతున్నందున  స్థానికులు, కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ. వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్ పి. నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, శేషికాంత్,  స్థానికులు గణేష్, ప్రేమ్, రజనీకాంత్, ఆంజనేయులు, రామకృష్ణ, సుబ్బారావు, సతీష్, వివేక్  పాల్గొన్నారు.