బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆహ్వానం
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఈవో వినోద్ రెడ్డి
సికింద్రాబాద్, జూలై 17 (విజయక్రాంతి): అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి ఈ నెల 21న జరిగే అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.
అనంతరం ఆలయ పండితులు ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఇంచార్జి సూపరింటెండెంట్ నాగరాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని చెప్పారు.






