18 April, 2026 | 11:39 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుంది

10-02-2026 01:02 AM
  1. మైనార్టీల ఓట్ల కోసమే హిందువులపై దాడులు
  2. ఎమ్మెల్యే డా. హరీష్‌బాబు

కాగజ్‌నగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు హిందువులపై దాడులు చేయిస్తూ అడ్డదారులు తొక్కుతున్నారని సిర్పూర్ శాసనసభ్యు లు డా. పాల్వాయి హరీష్ బాబు ఆరోపించా రు. కాగజ్నగర్ పట్టణంలోని రాజస్థాన్ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7న కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలోని చికెన్ సెంటర్లో పనిచేస్తున్న అజారుద్దీన్ అనే వ్యక్తి, బైక్‌పై వెళ్తున్న ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కేశెట్టి శంకరయ్యపై బండతో దాడి చేశారని తెలిపారు.

విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులు శివగౌడ్, చిలువేరు ప్రవీణ్ ఎందుకు దాడి చేశావని ప్రశ్నించగా, ‘మజాక్‌గా చేశాను’ అంటూ హేళనగా మాట్లాడినట్లు చెప్పారు.ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఇస్తే, హిందువులపై ఆరు సెక్షన్లతో నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అజారుద్ద్పీ మాత్రం కేవలం ఒక సెక్షన్తో కేసు పెట్టారని, ఇది అధికార దుర్వినియోగమేనని డా. హరీష్ బాబు ఆరోపించారు.

మైనార్టీల సంతుష్టీకరణలో భాగంగా కాంగ్రెస్ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అక్రమ కేసులతో బీజేపీ నాయకులను భయపెట్టలేరని అన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్కు దమ్ముంటే బీజేపీ కంటే ఒక్క సీటైనా అదనంగా సాధించాలని సవాల్ విసిరారు. అక్రమ కేసులకు తాము భయపడేది లేదని, ఇవి తమ మనోబలాన్ని మరింత పెంచాయని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేస్తామని, ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరిస్తున్నారని  ఆయన అన్నారు.