06-02-2026 01:06:32 AM
సోడా అమ్మే మహిళకు రూ.లక్ష సాయం
సదాశివపేట, ఫిబ్రవరి 5 :సదాశివపేట పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం స్థానిక శివాలయం నుండి మొదలుకొని మున్సిపల్ ఎన్నికల సందర్బంగా పట్టణంలో కాలినడకన తిరిగారు. అందులో భాగంగా రోడ్డుపై సోడా అమ్ముకునే వ్యక్తి దగ్గరికి స్వయంగా వెళ్లి వ్యాపారం ఎలా ఉందని అడగగా సోడ మిషన్ ఉంటే బాగుంటుందని,
మిషన్ కి లక్ష రూపాయలు అవసరం అవుతుందని అడగగానే తన మాటలకు చలించిన జగ్గారెడ్డి అప్పటికప్పుడు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయింది. పేదల పాలిట జగ్గారెడ్డి ఆపద్భాంధవుడిగా మారారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, చిరు, నాగరాజు గౌడ్, విజయ్, శంకర్ గౌడ్ ,ప్రశాంత్ గౌడ్, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.