VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఐకెపిలో పనిచేస్తున్న ఐకెపి సిబ్బంది సమస్యలను పరిష్కరించుటకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో IKP VOA JAC జిల్లా అధ్యక్షుడు ఎండి తాజోద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో VOA లు ఎమ్మెల్యే కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వారి డిమాండ్లను తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తో పాటు , కమిషనర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.ప్రభుత్వం SERP ఉద్యోగుల సమస్యల పట్ల చుట్ట శుద్ధితో ఉందని , మహిళలకు ప్రభుత్వం అనేక వివో సంఘాల ద్వారా లబ్ది చేకూరుస్తూ ఆర్ధికంగా బలపరుస్తుంది అని , మహిళా సంఘాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఉద్యోగుల డిమాండ్సని తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో VOA JAC నాయకులు , తదితరులు పాల్గొన్నారు.






