20 April, 2026 | 7:22 AM

మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు

20-04-2026 12:00 AM

టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం అని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకం కాదని టీజీఐఐసీ ఛైర్మెన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలోనే మహిళా బిల్లు ఆమోదం పొందేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.

కేవలం బీజేపీ వాళ్లు దీనిని ఒక ఆయుధంగా మార్చుకోవాలని కుట్ర చేశారని విమర్శించారు. డీలిమిటేషన్ లో మహిళా బిల్లును కలపడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీలో ఒక్క మహిళనైన ప్రధాని స్థాయికి తెచ్చారా అని, కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ ప్రధాని పదవిని చేపట్టారని తెలిపారు. 

కేంద్రానికి దైర్యం ఉంటే పార్లమెంట్‌లో మహిళా బిల్లును సెపరేట్‌గా ప్రవేశ పెట్టాలని, కాంగ్రెస్ తప్పకుండా మద్దతుని స్తుందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీ లిమిటేషన్, మహిళా బిల్లులను వాడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో మహిళలను కోటీశ్వరులను చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన సాగుతోందని చెప్పారు. సదాశివ పేట మున్సిపల్ ఛైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ, సంగారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ కూన వనిత, సదాశివపేట వైస్ ఛైర్ పర్సన్ శిరీష, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, కూన సంతోష్, కిరణ్ గౌడ్, చిరు, సిద్దన్న, మోతీ లాల్ నాయక్, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.