11 July, 2026 | 10:29 PM

ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక

11-07-2026 09:17 PM

చట్టం ఏం చెప్తుంది మీరు ఏం చేస్తున్నారు

 దళిత క్రైస్తవ గర్జనతో సత్తా చాటుతాం 

పాస్టర్ సుందర్ పాల్

మహబూబ్ నగర్ అర్బన్: దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు సత్తా చాటుతామని పాస్టర్ సుందర్ పాల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17వ తేదీన జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్ నందు దళిత క్రైస్తవ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత క్రైస్తవులు అత్యధికంగా హాజరై  సంపూర్ణ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఐక్యతతోనే సమస్య పరిష్కార రూపం దాల్చుతుందని,దళిత క్రైస్తవుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని వాటిని ఎదుర్కొనేందుకే తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 'దళిత క్రైస్తవ గర్జన' తో ఐక్యతకు అడుగులు వేద్దామని, ఇందుకు దళిత క్రైస్తవులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక చాలా ఏళ్ళ నుండి దళిత క్రైస్తవులపై దాడులతోపాటు అణచివేత ఘటనలను తాము సహించబోమని  హెచ్చరించారు. దళిత క్రైస్తవుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకొని మాకు రావాల్సిన హక్కుల్ని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని దేశస్థాయికి తీసుకెళ్లి తీవ్రతరం చేసి తమ సమస్యల్ని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 17న నిర్వహించే దళిత క్రైస్తవ గర్జనకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమానికి  ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దళిత క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.